సంగారెడ్డిలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు చర్యలు

by  |
సంగారెడ్డిలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు చర్యలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ అర్భన్ పథకం కింద ఆక్సిజన్ పార్కు ఏర్పాటుకు రూ .60 లక్షల నిధులు మంజూరయ్యాయి. పట్టణంలోని బస్టాండ్ పక్కనే ఉన్న పాలశీతలీకరణ కేంద్రాన్ని జూకల్ శివారులో నూతన భవనాన్ని నిర్మించి కొత్త యంత్రాలతో అక్కడ ఏర్పాటు చేశారు. పాత పాలశీతలీకరణ కేంద్ర భవనం నిరుపయోగంగా ఉండడంతోపాటు సుమారు రెండెకరాల వరకు భూమి ఉంది. దీంతో అక్కడ ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం శంఖుస్థాపన చేశారు. భవనం ఎదుట ఆక్రమణలు ఉండడంతో రెండు రోజుల క్రితం వాటిని తొలగించారు. ఆదివారం పాలశీతలీకరణ కేంద్రంలో ఉన్న యంత్ర సామాగ్రిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. యంత్రాలు, సామాగ్రిని తీసి ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ పాలశీతలీకరణ కేంద్రాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .

Next Story

Most Viewed