బిల్లులు చెల్లించండి.. గ్రామపంచాయతీకి తాళం వేసిన మాజీ సర్పంచ్

by Aamani |
బిల్లులు చెల్లించండి.. గ్రామపంచాయతీకి తాళం వేసిన  మాజీ సర్పంచ్
X

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొలమద్ది గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేశవరావు గ్రామపంచాయతీ ముందు కూర్చుని శుక్రవారం రోజున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ కేశవరావు మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు కొలమద్ది గ్రామానికి చాలా పనులు చేశానని గత ఐదు సంవత్సరాల నుండి నేను చేసిన పనులకు ఎటువంటి డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం లేదని నేను చేసిన పనులు గ్రామానికి 8 లక్షల రూపాయలు అభివృద్ధి పనులను సొంత ఖర్చులతో చేయించానని,ఇంకుడు గుంతలుకు మూడు లక్షల రూపాయలు, ఈజీఎస్ ద్వారా నూతన గ్రామ పంచాయతీ నిర్మించడానికి రూ. 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని, రైతులకు పొలాలకు వెళ్లడానికి గ్రామంలోని ట్రాక్టర్ యజమానులతో కలిసి రోడ్డు వేయించానని, వారికి కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని ట్రాక్టర్ యజమానులు రోజు నా ఇంటి ముందు వచ్చి డబ్బులు ఇవ్వాలని కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులకు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా రెండు సంవత్సరాల నుండి ఇవ్వలేదని ఇప్పటివరకు జిల్లాలలో బిల్లులు రాక పది మంది సర్పంచ్లు ఆత్మహత్య, హార్ట్ ఎటాక్,తో చనిపోయారని , ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం సర్పంచ్ లకు డబ్బులు ఇవ్వలేదని ప్రచారం చేసుకొని గద్దనెక్కారని అయినా కానీ ఇప్పుడు కలెక్టర్ చుట్టూ డీపీఓ చుట్టూ తిరిగిన వారు పైనుంచి డబ్బులు వచ్చినంక మీకు డబ్బులు ఇస్తామని పై అధికారులు అంటున్నారని చాలా సార్లు పై అధికారుల చుట్టూ తిరిగానని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తో పాటు మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story