సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

by  |
Thirumal Reddy
X

దిశ, అర్వపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌషికాహారం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి అన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి, సీతారాంపురం, తిమ్మాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను కమిటీ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు అందించే ఫుడ్‌ను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన అమలు తీరును ఏజన్సీ మహిళలను అడిగి తెలుసుకున్నారు.

State Food Commission

అనంతరం చైర్మన్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. వాటిని పటిష్టంగా క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరును సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయడంలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఆయన వెంట రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, భారతి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా సంక్షేమాధికారిణి జ్యోతి పద్మ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ దయానందరాణి, డీఆర్డీవో పీడీ ఎస్.కిరణ్ కుమార్, డీఎస్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి అశోక్, సీడీపీవో శ్రీజ, ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో విజయ, ఎంఈవో బాలూనాయక్, సర్పంచులు బైరబోయిన సునీత రామలింగయ్య, పాలెల్లి సురేష్, ఎంపీఓ సురేష్, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed