మా పొలంలో మొలకలు వచ్చాయోచ్..

by  |
మా పొలంలో మొలకలు వచ్చాయోచ్..
X

దిశ, ముధోల్: సాధారణంగా ఖరీఫ్ పంటలకి జూన్ మొదటి లేదా రెండో వారంలో విత్తనాలు వేస్తూ ఉంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ముందు చూపుగా పొలంలో దుక్కులు-దున్నులు చేపట్టిన రైతులు.. అనంతరం విత్తనాలు చల్లి మొలకల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి మోస్తారు వర్షాలు కురవడంతో విత్తనాలకు నీళ్లు అందినట్లైంది. ఈ ప్రక్రియతో విత్తనాలు మొలకెత్తాయి. దీంతో ముధోల్‌ మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పొలంలో మొలకలు వచ్చాయ్ అంటూ ఆయా గ్రామాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed