బీకేర్ ఫుల్.. వేసవి వేళ ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా..!

by Disha Web Desk 9 |
బీకేర్ ఫుల్.. వేసవి వేళ ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది డైట్ మెయింటైన్ చేస్తున్నారు. కాగా అందులో భాగంగానే ఎంతో మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా జ్యూస్‌లు తీసుకుంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే పండ్ల జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాజా ఫ్రూట్స్‌తో చేసిన జ్యూస్ పరిగడుపున తాగితే మంచి రుచిని ఇస్తుంది. అలాగే పండ్ల రసం బాడీని ఫిట్‌గా ఉంచేలా చేస్తుంది. శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. కానీ ఖాళీ కడుపున జ్యూస్ తాగితే పలు అనారోగ్య సమస్యల బారిన పడుతారంటున్నారు నిపుణులు.

ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్ల రసంలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవల్స్ ఆకస్మాత్తుగా పడిపోయే చాన్స్ ఉంటుంది. డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ మధ్య సమయం ఎక్కువగా ఉండడంతో మన కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో పుల్లని పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను అస్సలు తీసుకోకూడదు. అలాగే మీ దంతాలకు నష్టం వాటిల్లుతుంది. ఫ్రూట్స్ ఆమ్లత్వం రసంలో పేరుకుపోతుంది. ఎనామోల్ అని పిలువబడే దంతాలపై పొరను దెబ్బతీస్తుంది. దీంతో పళ్లు సున్నితంగా మారిపోయే అవకాశం ఉంటుంది. మార్నింగ్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. అంతేకాకుండా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పండ్ల రసంలో ఫైబర్ ఉండదు కాబట్టి జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమయ్యే చాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉయం పూట జ్యూస్ అస్సలు పండ్ల రసాలు తీసుకోవద్దు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story