Rinku Singh : మరో యువీగా రింకు సింగ్‌.. గావస్కర్

by Disha Web Desk 13 |
Rinku Singh : మరో యువీగా రింకు సింగ్‌.. గావస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత జట్టులోకి వచ్చిన రింకు సింగ్‌ తన సత్తా నిరూపించుకున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో ‘ఫినిషర్’గా మారిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోని టీ20లతోపాటు వన్డే ఫార్మాట్‌కూ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో రింకు సింగ్‌ను భవిష్యత్తు యువరాజ్‌గా అభివర్ణిస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. భారత్‌ జట్టు సగర్వంగా తలెత్తుకోవడంలో యువరాజ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడని.. రింకు సింగ్‌ కూడా అలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గావస్కర్‌ ప్రశంసించాడు.

‘‘భారత జట్టులో భాగస్వామిగా మారిన రింకు సింగ్‌ తన దూకుడైన ఆటతో ఆడుతున్నాడు. అతడిపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు యువరాజ్‌ సింగ్‌తో పోలుస్తూ వాటిని మరింత పెంచేశారు. టీమిండియా కోసం యువీ చేసిన కృషిలో రింకు కొంత చేసినా చాలు అద్భుతమవుతుంది. వన్డే ప్రపంచ కప్‌ 2011లో యువీ ఏ విధమైన ప్రదర్శన చేశాడో మనమంతా చూశాం. అంతకుముందు 2007 పొట్టి కప్‌ను నెగ్గడంలోనూ కీలక పాత్ర పోషించాడు. రింకు సింగ్‌ విషయంలోనూ ఇదే జరగాలని ఆశిద్దాం. నిరంతరం ఆడుతూ ఉండాలి. ఒక్కోసారి టాలెంట్‌ ఉన్నా అవకాశాలు త్వరగా రావు. కానీ, ఎప్పుడు ఛాన్స్‌ వచ్చినా సాధించగలననే నమ్మకంతో ఉండాలి. గత రెండు, మూడేళ్లు రింకు సింగ్‌ చేసిందదే. ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నప్పటికీ ఎక్కువ మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. కానీ, వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు భారత జట్టులోకే వచ్చేశాడు’’ అని గావస్కర్‌ తెలిపాడు.



Next Story

Most Viewed