'ఫైనల్ ఒక్కటే ఉంటుంది'.. రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్స్ కౌంటర్

by Disha Web Desk 13 |
ఫైనల్ ఒక్కటే ఉంటుంది.. రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్స్ కౌంటర్
X

న్యూఢిల్లీ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌లుగా నిర్వహించాలని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రతిపాదనను మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ తప్పుబట్టారు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ సర్కిల్ ప్రారంభానికి ముందే ఒక్క ఫైనల్ ఉంటుందని అందరికీ తెలుసు అని, అందుకు తగ్గట్టు సిద్ధం కావాలన్నాడు. బెస్ట్ ఆఫ్ త్రీ గురించి మాట్లాడేవారు భవిష్యత్తులో బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఆడించాలని డిమాండ్ చేస్తారని చెప్పాడు. హర్భజన్ సింగ్ కాస్త ఘాటుగానే స్పందించాడు.

‘వన్డే వరల్డ్ కప్‌లో ఏం జరగాలో వారిని అడగాలనుకుంటున్నా. అక్కడ కూడా మూడు ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించాలా?. ఫైనల్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడితే మీరు ఈ వ్యాఖ్యలు చేస్తారా?.. కచ్చితంగా చేయరు. ఒక్క ఫైనల్ సరిపోతుందనే చెబుతారు. వన్డే వరల్డ్ కప్ అయినా, టెస్టు చాంపియన్‌షిప్ అయినా ఒక్కటే ఫైనల్ ఉంటుంది. టెన్నిస్, ఫుట్‌బాల్ లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్‌లోనూ ఒక్కటే ఫైనల్ ఉంటుంది’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు.



Next Story

Most Viewed