అరుదైన రికార్డు సాధించిన టీమ్ ఇండియా.. 112 ఏళ్లలో తొలి జట్టుగా ఘనత

by Dishanational3 |
అరుదైన రికార్డు సాధించిన టీమ్ ఇండియా.. 112 ఏళ్లలో తొలి జట్టుగా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌పై 4-1తో టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమ్ ఇండియా అరుదైన రికార్డును సాధించింది. హైదరాబాద్ టెస్టులో ఓడిన భారత్.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది. ఈ సిరీస్ విజయంతో టెస్టు ఫార్మాట్‌లో 112 ఏళ్లనాటి రికార్డును భారత్ సమం చేసింది. తొలి గేమ్ ఓడి 4-1తో సిరీస్ గెలుచుకున్న జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సరసన నిలిచింది. అంతేకాకుండా, 112 ఏళ్లలో ఇలాంటి సిరీస్ విజయం సాధించిన తొలి జట్టుగా టీమ్ ఇండియా అరుదైన రికార్డును నెలకొల్పింది. గతంలో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఓడి సిరీస్‌ను 4-1తో దక్కించుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే నమోదుయ్యాయి. ఆ మూడు సందర్భాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌లోనే చోటుచేసుకున్నాయి. మొదటిసారిగా 1897-98, 1901-02లలో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఓడి 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరిసారిగా 1911-12లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఇదే తరహాలో సిరీస్ విజయం సాధించింది. 1912 తర్వాత టీమ్ ఇండియా ఈ రికార్డును నమోదు చేసింది.

Next Story

Most Viewed