ఓపెన్ ​కిక్​ బాక్సింగ్‌లో శ్రీకృతికి మూడు పతకాలు

by Dishanational3 |
ఓపెన్ ​కిక్​ బాక్సింగ్‌లో శ్రీకృతికి మూడు పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : వాకో ఇండియా అంతర్జాతీయ ఓపెన్​ కిక్​ బాక్సింగ్​ టోర్నీలో తెలంగాణ అమ్మాయిలు దుమ్ము లేపారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరిగింది. ఎనిమిదేళ్ల బాలికల విభాగంలో మ్యూజికల్ ఫామ్ నాంచాక్ కేటగిరీలో చాతరాజు శ్రీకృతి గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే, హ్యాండ్ కేటగిరీలో సిల్వర్ మెడల్, 28 కేజీ పాయింట్ ఫైట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అలాగే, 9 నుంచి నుంచి 14 ఏళ్ల బాలుర, బాలికల విభాగాల్లో లేశ్రిత సాయి, మేకల రితాన్ రెడ్డి, కొమ్ము యువరాజ్, పాలే అవినాష్, మన్నే వైష్ణవి, శ్రీ ప్రజ్ఞా గాయత్రి, ఎం.హెచ్ గ్రీష్మికారావు, సామల అక్షిత పతకాలు సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో విజ్జగిరి అక్షయ్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. వీరిని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ఇండియా కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ సంతోష్ అగర్వాల్ అభినందించారు. కాగా, టోర్నీలో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబర్చారని జనని సెల్ఫ్ డిఫెన్స్ కిక్ బాక్సింగ్ అకాడమీ డైరెక్టర్లు సుప్రియ జాడి, ఆవుల రాజనర్సు హర్షం వ్యక్తం చేశారు.


Next Story