SRH Vs MI: ఎస్ఆర్‌హెఎచ్, ముంబై మ్యాచ్ తెచ్చిన తంటా.. రోహిత్ అభిమానులు చేసిన పనికి అంతా షాక్..!

by Disha Web Desk 1 |
SRH Vs MI: ఎస్ఆర్‌హెఎచ్, ముంబై మ్యాచ్ తెచ్చిన తంటా.. రోహిత్ అభిమానులు చేసిన పనికి అంతా షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-17 ఎడిషన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది. 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై ముందుగా ధాటిగా ఆడినా.. క్రమంగా వికెట్లను కోల్పోతూ పరాజయం పాలైంది. అయితే, ఇదే మ్యాచ్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసినంత పని చేసింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో ధోని, రోహిత్ ఫ్యాన్స్ కొంతమంది కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే ధోని అభిమాని బండోపంత్ టిబిలే (63) రోహిత్ అవుటైన వెంటనే సంబురాలు చేసుకున్నాడు. మీ మాజీ కెప్టెన్ అవుటయ్యాడు ముంబై ఎలా గెలుస్తుందంటూ హేళన చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రోహిత్ ఫ్యాన్ బలంత్, సాగర్‌లు బండోపంత్ టిబిలే తలపై బలంగా కర్రతో కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అతడిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story