Pink Jerseys: పింక్ జెర్సీల‌తో నిండిపోయిన‌ స్టేడియం.. కార‌ణం ఏంటంటే..?

by Vinod kumar |
Pink Jerseys: పింక్ జెర్సీల‌తో నిండిపోయిన‌ స్టేడియం.. కార‌ణం ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త్, సౌతాఫ్రికా జ‌ట్లు మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా జొయ‌న్నెస్‌బ‌ర్గ్‌లో తొలి వ‌న్డేలో త‌ల‌ప‌డుతున్నాయి. న్యూ వాండెర‌ర్స్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో స‌ఫారీ జ‌ట్టు ఆకుప‌చ్చ రంగు జెర్సీల‌తో కాకుండా ‘పింక్ జెర్సీ' తో బ‌రిలోకి దిగింది. సౌతాఫ్రికా ఆట‌గాళ్లు మాత్రమే కాదు స‌హాయ‌క సిబ్బంది, మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన అభిమానులు కూడా గులాబీ రంగు జెర్సీలు వేసుకొన్నారు. దాంతో స్టేడియ‌మంతా గులాబీమ‌యం అయింది. స‌ఫారీ ప్లేయ‌ర్లతో పాటు వీళ్లంతా పింక్ జెర్సీ వేసుకోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. ‘పింక్ డే'(Pink Day) సంద‌ర్భంగా అంద‌రూ గులాబీ రంగు జెర్సీలు ధ‌రించారు. రొమ్ము క్యాన్సర్(Breast Cancer) మీద అవ‌గాహ‌న పెంచ‌డం కోసం వీళ్లంతా గులాబీ జెర్సీలు వేసుకున్నారు. సౌతాఫ్రికా జ‌ట్టు పింక్ జెర్సీలో ఆడ‌డం ఇది రెండోసారి. 2013లో పాకిస్థాన్‌తో జ‌రిగిన వ‌న్డేలో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు తొలిసారి పింక్ జెర్సీ వేసుకున్నారు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా..

73 పరుగుల వద్ద (16.1 ఓవర్‌లో) సౌతాఫ్రికా 8 వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్‌ ఇచ్చి కేశవ్‌ మహారాజ్‌ (4) ఔటయ్యాడు.

Next Story