‘అతనికే ఎందుకు ఇలా జరుగుతుంది’ బీసీసీఐ, జై షాపై నెటిజన్లు ఫైర్

by Dishanational3 |
‘అతనికే ఎందుకు ఇలా జరుగుతుంది’ బీసీసీఐ, జై షాపై నెటిజన్లు ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు వెన్నునొప్పి తిరగబెట్టింది. విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై తరపున ఆడిన అయ్యర్ బుధవారం వెన్నునొప్పితో మైదానంలోకి అడుగుపెట్టలేదు. చివరి రోజైన గురువారం కూడా అతను మైదానంలోకి రాలేదు. స్కానింగ్ కోసం అతను హాస్పిటల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వెన్నొ నొప్పి తీవ్రంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌‌లో కొన్ని మ్యాచ్‌లకు అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకుని లీగ్‌లో పాల్గొంటాడని పేర్కొన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)కు అయ్యర్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. వెన్ను నొప్పితోనే అతను గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జట్టును నితీశ్ రాణా నడిపించాడు. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు అయ్యర్‌కు వెన్ను గాయం తిరబెట్టడం కేకేఆర్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. దీనిపై బీసీసీఐ‌గానీ, కేకేఆర్‌గానీ స్పష్టతనివ్వాల్సి ఉంది. ఈ నెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ అనంతరం వెన్ను గాయంతో అయ్యర్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. సిరీస్‌లో సత్తాచాటకపోవడంతోనే అతనిపై సెలెక్టర్లు వేటు వేసినట్టు వార్తలు వచ్చాయి. అయ్యర్ పునరావసం కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరగా ఎన్‌సీఏ అతను ఫిట్‌గానే ఉన్నాడని బీసీసీఐ‌కి నివేదిక పంపింది. దీంతో గాయం సాకుతో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడన్న కారణంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే, అయ్యర్‌గా ఫిట్‌గా ఉన్నాడని ఎన్‌సీఏ ఇచ్చిన రిపోర్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్‌గా ఉంటే స్వల్ప రోజుల్లోనే అతనికి వెన్ను గాయం తిరగబెట్టడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐపై, సెక్రెటరీ జై షాపై ఫైర్ అవుతున్నారు. ‘అయ్యర్‌ను దురదృష్టం వెంటాడుతుంది.. అయ్యర్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed