ఇబ్బందుల్లో ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమ్మిన్స్.. ఆసీస్ కెప్టెన్ అతడనే..?

by Disha Web Desk 13 |
ఇబ్బందుల్లో ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమ్మిన్స్.. ఆసీస్ కెప్టెన్ అతడనే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయం ఒక వైపు.. మరో వైపు పలువురు ప్లేయర్స్ గాయాలపాలవడంతో ఇబ్బందుల్లో ఉండగా.. ఇప్పుడు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే టీమిండియాతో మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు మొదలు కానుంది. కానీ, ఆ సమయానికి తాను రాలేనని కమిన్స్ సమాచారమిచ్చాడు.

‘‘ఈ సమయంలో భారతదేశానికి రాకూడదని నిర్ణయించుకున్నా. ఇక్కడ నా కుటుంబంతో కలిసి ఉండటం ఉత్తమమని భావిస్తున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కు, సహచరులకు ధన్యవాదాలు’’ అని కమిన్స్ చెప్పినట్లు ఓ క్రికెట్ వెబ్ సైట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమ్‌ను నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ బ్యాట్స్ మన్, గతంలో కెప్టెన్‌గా పనిచేసిన స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక మూడో టెస్టులో కమ్మిన్స్ స్థానంలో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు.



Next Story

Most Viewed