టీమిండియాకు కొత్త కెప్టెన్.. అధికారిక ప్రకటన

by Disha Web Desk 2 |
టీమిండియాకు కొత్త కెప్టెన్.. అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో టీ20 సీరిస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మొత్తంగా సూర్య, గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేశ్‌లను ఎంపిక చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగనుంది. సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, వరల్డ్ కప్ ఫైనల్‌లో సొంత గడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పొందిన టీమిండియా సిరీస్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Next Story