అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత బృందానికి మన్‌రాజ్, రక్షిత నేతృత్వం..

by Disha Web Desk 13 |
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత బృందానికి మన్‌రాజ్, రక్షిత నేతృత్వం..
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది డచ్, జర్మన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్లు పాల్గొననున్నాయి. 19 మంది సభ్యుల భారత బృందానికి పురుషుల సింగిల్స్‌లో షట్లర్లు మన్‌రాజ్ సింగ్, మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ నేతృత్వం వహించనున్నారు. పురుషుల సింగిల్స్‌లో మన్‌రాజ్ అగ్రస్థానంలో నిలవగా.. ఆయుష్ శెట్టి, లోకేష్ రెడ్డి, గగన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 'వర్ధమాన షట్లర్లతో కూడిన మంచి బృందం ఇది. జూనియర్ స్థాయి టోర్నీల్లో వీళ్లు సత్తా చాటుతున్నారు. వీళ్లంతా సెలెక్షన్ ట్రయల్స్‌లో తమ చక్కని ప్రతిభ చూపి జట్టులో చోటు సంపాదించారు. వీళ్లందరికీ పతకాలు గెలిచే సత్తా ఉంది. ఈ టోర్నీలోనే కాకుండా రాబోయే టోర్నీల్లోనూ వీళ్లు ప్రతిభ కనబరుస్తారన్న నమ్మకముంది' అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా చెప్పారు.

భారత జట్లు:

పురుషుల సింగిల్స్: మన్‌రాజ్ సింగ్, అయుష్ శెట్టి, లోకేశ్ రెడ్డి కె, గగన్

మహిళల సింగిల్స్: రక్షిత శ్రీ ఎస్, శ్రేయా లెలె, జియా రావత్, అలైషా నాయక్

పురుషుల డబుల్స్: భవ్య ఛబ్ర/పరమ్ చౌదరి, దివ్యం అరోరా/మయాంక్ రాణా

వుమెన్ డబుల్స్: వెన్నెల కె/శ్రేయాన్షి వలిశెట్టి, వైష్ణవి ఖడేకర్/సానియా సికందర్

మిక్స్‌డ్ డబుల్స్: అరుల్‌మురుగణ్ ఆర్/శ్రీనిధి ఎన్, సాత్విక్ రెడ్డి/వైష్ణవి ఖడేకర్


Next Story

Most Viewed