ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

by Disha Web Desk 13 |
ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
X

కైరో: ఈజిఫ్ట్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ గోల్డ్ మెడల్ సాధించాడు. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో 588 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచిన ప్రతాప్.. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 406.4 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌‌లోనూ ప్రతాప్ అదే జోరు ప్రదర్శించాడు.

ఆస్ట్రియాకు చెందిన అలెగ్జాండర్ ష్మిర్ల్‌పై 6-16 తేడాతో విజయం సాధించాడు. 11 సిరీస్‌ల్లో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న ప్రతాప్ ఫైనల్‌ను ఏకపక్షంగా గెలుచుకుని విజేతగా నిలిచాడు. దాంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. మరో భారత షూటర్ అఖిల్ షెరాన్ ఇదే ఈవెంట్‌లో 587 పాయింట్స్‌తో క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 7వ స్థానంతో సరిపెట్టాడు. మొత్తంగా టోర్నీలో భారత్ 6 పతకాలతో(4 స్వర్ణాలు, 2 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉన్నది.

Also Read..

కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్..



Next Story

Most Viewed