డబ్బు పిచ్చితో మా నాన్న చనిపోయిన వెళ్లలేదు అన్నారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
డబ్బు పిచ్చితో మా నాన్న చనిపోయిన వెళ్లలేదు అన్నారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ఇప్పుడు అడప దడప మూవీస్‌లో కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్‌తో ఎంతో మందిని నవ్వించిన కోవై సరళ లైఫ్‌లో ఓ విషాదకర సంఘటన ఉందట. తాజాగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు వచ్చిన ఈమె.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘మా సొంత ఊరు కోయంబత్తూర్. కోయంబత్తూర్ ని షార్ట్‌గా కోవై అని అంటారు. మా ఊరిపేరే నాకు ఇంటి పేరుగా మారిపోవడంతో నన్ను కోవై సరళ అని పిలిచేవారు’ అని చెప్పుకొస్తూ తన ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పింది. ‘పెళ్లి అవసరం ఏముంది. పెళ్లి చేసుకునే జీవించాలని కండిషన్ లేదు కదా. ఇక నా జీవితంలో నా తండ్రి మరణం ఎంతో విషాదకరం. నేను ఊటీలో షూటింగ్‌లో ఉన్న సమయంలో మా నాన్న చనిపోయారు. నేను సినిమా చేస్తున్న నిర్మాణ సంస్థ చాలా చిన్నది. పైగా మూవీ టీమ్ మొత్తం అక్కడే ఉన్నాము. కాబట్టి నాన్న చనిపోయారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తే.. టీమ్, షూటింగ్ ఎక్కడ డిస్టబ్ అవుతుందో అని అలాగే ఉండిపోయాను. నిర్మాతలకు నష్టం రాకూడదు అనే ఒక్క రీజన్‌తో నేను వెళ్లలేదు. కానీ చాలా మంది సినిమా వాళ్లకు డబ్బు పిచ్చి.. అందుకే తండ్రి చనిపోయిన వెల్లలేదు అని నెగిటివ్‌గా ప్రచారం చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed