2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్

by Mahesh |
2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
X

దిశ, వెబ్ డెస్క్: 2025 డిసెంబర్ నెలలో జరిగే హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఎఫ్‌ఐహెచ్ ప్రకటించింది.అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు మంగళవారం భారత్‌కు ఆతిథ్యమివ్వాలని నిర్ణయించింది. కాగా జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో మొత్తం 24 జట్లు పాల్గొననుండా.. ఈ ఈవెంట్ లో ఇన్ని జట్టు పాల్గొనడం ఇది ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. రాగా ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగక ఆనతంరం ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ మాట్లాడుతూ.. “విశాలమైన, విభిన్నమైన జాతీయ సంఘాలతో ఆడేందుకు మరిన్ని అవకాశాలను అందించడం మా సాధికారత, వ్యూహంలో కీలకమైన స్తంభాలలో ఒకటి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఒమన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ5 వరల్డ్ కప్‌లో మరింత వైవిధ్యం మా ఈవెంట్‌లకు భారీ అదనపు విలువను ఎలా తీసుకువస్తుందో చూశాం” ఇందులో భాగంగానే భారత్ లో 2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

Next Story