టెస్టుల్లో టాప్ ర్యాంక్ కోల్పోయిన భారత్

by Dishanational5 |
టెస్టుల్లో టాప్ ర్యాంక్ కోల్పోయిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్‌ను రెండో స్థానానికి నెట్టి ఆస్ట్రేలియా నం.1 టెస్టు జట్టుగా అవతరించింది. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌ను శుక్రవారం ఐసీసీ అప్‌డేట్ చేసింది. ఆసిస్ 118 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా.. భారత్ 117 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అప్‌డేట్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు 118 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, ఎక్కువ పాయింట్లతో టీమ్ ఇండియానే టాప్ ర్యాంక్‌లో ఉంది. అయితే, సౌతాఫ్రికాతో 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకున్నప్పటికీ.. పాక్‌పై ఆస్ట్రేలియా వరుసగా రెండు విజయాలు సాధించడంతో భారత్ తన స్థానాన్ని కోల్పోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విక్టరీతోపాటు సొంతగడ్డపై ప్రదర్శన ఆధారంగా ఆసిస్ జట్టు అగ్రస్థానానికి చేరుకుందని ఐసీసీ తెలిపింది. టాప్-5లో వరుసగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. మరోవైపు, రెండో టెస్టులో సౌతాఫ్రికాపై నెగ్గడంతో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టాప్ ర్యాంక్‌ను తిరిగి పొందిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రా, ఒక ఓటమితో భారత్ 54.16 పర్సంటేజ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.



Next Story