'పాక్ బౌలింగ్‌ను ఇండియా కాపీ కొట్టింది'

by Disha Web Desk 13 |
పాక్ బౌలింగ్‌ను ఇండియా కాపీ కొట్టింది
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌పై ఇండియా సిరీస్ గెలిచిన తర్వాత పాక్ పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ను చూసే ఇండియా తమ బౌలింగ్ కూర్పును రూపొందించిందని నాకు తరచూ అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. హరీస్ రవూఫ్ లాంటి పేస్ ఉమ్రాన్ మాలిక్ సొంతం.. ఇక షాహీన్ అఫ్రిది లాగా అర్ష్‌దీప్ లెఫ్టామ్ వెరైటీని అందిస్తున్నాడని పేర్కొన్నాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వసీం జూనియర్ లాగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇద్దరి పేస్ ఒకేలా ఉంటుంది. ఇక శివమ్ మావి సపోర్టింగ్ బౌలర్ పాత్ర పోషిస్తున్నాడు" అని రమీజ్ అన్నాడు. అయితే ఇండియా స్పిన్ బౌలింగ్ మాత్రం పాక్ కంటే మెరుగ్గా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. "ఇండియా స్పిన్ బౌలింగ్ పాకిస్థాన్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా పాక్ ఈ విషయంలోనే మెరగవ్వాలని భావిస్తాను" అని రమీజ్ అన్నాడు.


Next Story

Most Viewed