WTC Final 2023: ఆసీస్‌తో ఫైనల్ ఫైట్‌కు టీమ్ ఇండియా రెడీ..

by Disha Web Desk 13 |
WTC Final 2023: ఆసీస్‌తో ఫైనల్ ఫైట్‌కు టీమ్ ఇండియా రెడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్ గ్రౌండ్స్‌లో ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఫైనల్ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.

పిచ్ రిపోర్ట్..

WTC Final 2023 ఫైనల్ మ్యాచ్‌‌కు లండన్‌లోని ఓవల్‌లో వేదికకానుంది. ఈ పిచ్‌‌పై మంచి బౌన్స్ కనిపిస్తోంది. ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు మంచి సహకారం అందుతుంది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్ బౌలర్లకు రాణించే అవకాశం ఉంది. మూడో రోజు నుంచి స్పిన్నర్ల ఆధిపత్యం మొదలు అవుతుంది. పిచ్‌పై పచ్చిక ఉండడంతో బ్యాట్స్‌మెన్‌ను పేసర్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దూరదర్శన్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు..

ఈ గ్రౌండ్‌లో ఆసీస్ జట్టు కంటే టీమ్ ఇండియా తక్కువ మ్యాచ్‌లు ఆడింది. ఓవల్ మైదానంలో ఆసీస్ టీమ్ 38 టెస్టులు ఆడగా.. 7 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీమిండియా 14 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ రెండింటిలో విజయం సాధించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు ఓవరాల్‌గా మొత్తం 106 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆసీస్ 44 విజయాలు సాధించగా.. భారత్ 32 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ గ్రౌండ్‌లో 2021లో చివరి టెస్టు ఆడగా.. అందులో విజయం సాధించింది.

భారత్ (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

ఆస్ట్రేలియా (అంచనా):

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లయోన్, స్కాట్ బోలాండ్



Next Story

Most Viewed