ఇండోర్‌ టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ స్పిన్నర్.. 5 వికెట్లతో భారత్‌కు చుక్కలు..

by Disha Web Desk 13 |
ఇండోర్‌ టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ స్పిన్నర్.. 5 వికెట్లతో భారత్‌కు చుక్కలు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం అందింది. దీన్ని చక్కగా ఉపయోగించుకున్న ఆసీస్ బౌలర్లు.. భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ అద్భుతం చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్పిన్‌ మాథ్యూ కున్‌మాన్‌ భారత ఇన్నింగ్స్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్‌లను అవుట్ చేశాడు. కునేమన్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ మిస్సయ్యాడు. ఈ బంతిని అందుకున్న కీపర్ క్యారీ వికెట్లను కూల్చడంతో రోహిత్ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (21) కూడా కునేమన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడేందుకు అతను ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకున్న బంతిని స్లిప్స్‌లో ఉన్న స్మిత్ చక్కగా అందుకున్నాడు.

అలాగే డిఫెన్స్ ఆడబోయిన అశ్విన్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కునేమన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఉమేష్ యాదవ్ (17) రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ వెంటనే కునేమన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కునేమన్ ఐదు వికెట్లు హాల్ పూర్తయింది. దీంతో భారత జట్టు కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కునేమన్ ఐదు, లియాన్ మూడు, మర్ఫీ ఒక వికెట్ తీసుకున్నారు.

Next Story

Most Viewed