ప్రమాదంలో టెస్ట్ క్రికెట్.. భారత మాజీ వికెట్ కీపర్

by Disha Web Desk 13 |
ప్రమాదంలో టెస్ట్ క్రికెట్.. భారత మాజీ వికెట్ కీపర్
X

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అసూయ పడే స్థాయికి చేరడం సంతోషకరమని భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ అన్నారు. అయితే.. టెస్ట్ క్రికెట్ ‘డేంజర్’ జోన్ లో ఉండటం మంచిది కాదని, దీన్ని డేంజర్ జోన్ నుంచి బయటికి తేవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆర్థికంగా బలమైన దేశాలు టెస్ట్ క్రికెట్ ను ఇకా కొనసాగిస్తున్నాయి.

కానీ.. చిన్న దేశాలు మాత్రం వ్యాపార దృష్టిలో చూస్తూ పొట్టి క్రికెట్ నే స్పాన్సర్ చేస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ కూడా పరిమిత ఓవర్ల మ్యాచ్ మాదిరిగానే ఆసక్తికరంగా ఉంటుందని నిరూపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు 85 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ మాంచెస్టర్ వెళ్లారు.



Next Story

Most Viewed