వరల్డ్ కప్‌లో వైఫల్యం.. క్రికెట్ బోర్డు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
వరల్డ్ కప్‌లో వైఫల్యం.. క్రికెట్ బోర్డు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక పాయింట్ల టేబుల్‌లో లంక జట్టు అఫ్గాన్ జట్టు కన్నా కింద ఉంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ ల్లోనే ఈ జట్టు విజయం సాధించింది. ఈ పరిణామాలతో ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి రిజైన్ చేయగా... తాజాగా ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే స్పందించారు. బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదన్నారు. బోర్డులో అవినీతి పెరిగిపోయిందన్నారు. దీంతో బోర్డును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక వరల్డ్ కప్‌లో శ్రీలంక ప్రదర్శనతో బోర్డు కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉండటంతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. కొలంబో పోలీసులు బోర్డు కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story