రాహుల్ కు తుది జట్టులో చోటుపై చాట్ జీపీటీ తేల్చేసింది..

by Disha Web Desk 1 |
రాహుల్ కు తుది జట్టులో చోటుపై చాట్ జీపీటీ తేల్చేసింది..
X

దిశ, వెబ్ డెస్క్: కేఎల్ రాహుల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఈ భారత డ్యాషింగ్ ఓపెనర్ వరుస వైఫల్యాలతో మాజీ క్రికెటర్ల నుంచి సగుటు అభిమానులు అతడిపై పెదవి విరుస్తున్నారు. దీంతో భారత జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా భారత మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్ మరియు ఆకాష్ చోప్రాలు కూడా రాహుల్ ఆటతీరు పట్ల సోషల్ మీడియాలో వాగ్వాదానికి దిగారు. కానీ, ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారి వారి సొంత అభిప్రాయలు వారికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్ కు చోటు కల్పి్స్తారా లేదా అన్న దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫాం అయిన చాట్ జీపీటీని అడగ్గా ఆసక్తికర సమాధానాలను వెల్లడించింది.

కేఎల్ రాహుల్‌ను భారత టెస్టు జట్టు నుంచి తప్పించాలా? అంటే.. అందుకు సమాధానంగా ఒక నిర్ధిష్టమైన వ్యక్తి గురించి తనకు వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాత ధోరణి లేవని వెల్లడించింది. అదేవిధంగా, నియయం ప్రకారం ఒక ఆటగాడిన జట్టు నుంచి తొలగించాలంటే వారి ఆట తీరు, ఫిట్ నెస్ ను ప్రమాణికంగా తీసుకోవాలని సూచించింది. సంబంధిత ఆటగాడి యోక్క ఇటీవల ప్రదర్శన, నిలకడ సరిగా లేని పక్షంలో అతని స్థానంలో మెరుగైన ప్రదర్శన చేయగల ఆటగాడిని అతని స్థానంలో తీసుకోవాలని సూచించింది.

ఏది ఏమైనా.. ఇప్పటికే టీమ్ మేనేజ్ మెంట్ రాహుల్ ను వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. అదేవిధంగా ఇండోర్ లో జరిగే మూడో టెస్ట్ తది జట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ కు అశకాశం కల్పిస్తారని క్రీడా పండితులు తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed