ప్రత్యేక హోదాను అమ్మేశారు.. చట్టంలో ఉంటే కోర్టుకెళ్లే వాళ్లం: సీఎం జగన్

by srinivas |
ప్రత్యేక హోదాను అమ్మేశారు.. చట్టంలో ఉంటే కోర్టుకెళ్లే వాళ్లం: సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వైసీపీ ఎజెండా అని, కానీ ప్రాకేజీ పేరుతో హోదాను అమ్మేశారని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా తప్పు చేసిందని మండిపడ్డారు. దాన్ని వల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉంటే సాధన కోసం అవసరమైతే కోర్టుకెళ్లే వాళ్లమన్నారు. మోడీ దేశానికి ప్రధాని అని, తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీతో సిద్ధంతం పరంగా విభేదాలు ఉంటాయన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తులపై ఆయా పార్టీల నాయకులకే స్పష్టతలేదని విమర్శించారు. తనను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మంచికే ఓటు వేయమంటున్నాం. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. నోటాకు వచ్చిన ఓట్లు సైతం కాంగ్రెస్‌కు రాలేదని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story