టీమిండియాకు బుమ్రా దూరం.. అతడి స్థానం ఎవరికి..!

by Disha Web Desk 14 |
టీమిండియాకు బుమ్రా దూరం.. అతడి స్థానం ఎవరికి..!
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికాతో సిరీస్‌కు సిద్ధమవుతుండగా టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బౌలర్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. అయితే అతడికి 4 నుంచి 6 నెలల విశ్రాంతి కావాలని వైద్యులు తెలపడంతో సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న టీమ్‌లో బుమ్రా పేరు తొలగించబడింది. దీంతో ప్రేక్షకుల్లో సరికొత్త సందేహం ఏర్పడింది. ఇప్పుడు ఇండియా జట్టులో బుమ్రా స్థానాన్ని ఏ ఆటగాడు బర్తీ చేయనున్నాడన్నది అభిమానులు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

అంతేకాకుండా మరికొందరు తమ ఊహాగానాలను కూడా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు బౌలర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇండియా జట్టులో బుమ్రా స్థానాన్ని షమి, సిరాజ్, చాహర్‌లలో ఒకరు బర్తీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే సెలక్టర్ వీళ్ల ఫార్మ్ చార్ట్‌లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. కానీ ఈ ముగ్గురిలో టీమిండియాలో స్థానం పొందే అవకాశం సిరాజ్‌కే ఎక్కువగా ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరి వీరిలో సెలక్టర్లు ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాలి.

Next Story