ఆసియా అండర్-20 ఛాంపియన్ షిప్స్ లో ఖాతా తెరిచిన భారత్

by Dishanational6 |
ఆసియా అండర్-20 ఛాంపియన్ షిప్స్ లో ఖాతా తెరిచిన భారత్
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో భారత్ ఖాతా తెరిచింది. డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ పతకం గెలుచుకున్నాడు. డిస్కస్ త్రోలో అథ్లెట్ రితిక్ రాథీ రజతం గెలుచుకుని.. భారత్ కు ఈ ఈవెంట్ లో తొలి పతకాన్ని అందించాడు.

బుధవారం దుబాయ్‌లో జరిగిన ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం అయ్యాయి. రితిక్ రాథీ 53.01 మీటర్లు డిస్క్ ను విసిరి అత్యుత్తమ త్రోను నమోదు చేసి ప్రశంసలు అందుకున్నాడు.

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఈవెంట్ కోసం 60 మంది సభ్యులను ప్రకటించింది. ఆగస్టులో పెరూలోని లిమాలో జరిగే అండర్-20 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ కు ఈ ఈవెంట్ ను క్వాలిఫయర్ గా పరిగణించనున్నారు. ఇకపోతే, గతేడాది జరిగిన ఆసియా అండర్-10 ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ ఆరు బంగారు పతకాలతో సహా 19 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.



Next Story

Most Viewed