అశ్విన్‌ స్పిన్ మహాద్భుతం: ఇయాన్ చాపెల్

by Disha Web Desk 1 |
అశ్విన్‌ స్పిన్ మహాద్భుతం: ఇయాన్ చాపెల్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాలోనే అశ్విన్ సత్తా చాటాడని, అతనో అద్భుతమైన స్పిన్నరని కొనియాడాడు. అశ్విన్ అంత నైపుణ్యం రవీంద్ర జడేజాకు లేకపోయినా అతను భారత్ పిచ్‌లకు సరిగ్గా సరిపోయే బౌలరని తెలిపాడు. ఈ భారత స్పిన్ ద్వయాన్ని అనుకరించేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారని, అందరూ విజయవంతం కాలేరని ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

వికేట్లన్నీ స్పిన్నర్లకే..

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింట్లోనూ ఆసీస్‌పై భారత్ విజయం సాధించింది. జడేజా-అశ్విని నాలుగు ఇన్నింగ్స్‌ల్లోని 40 వికెట్లలో 31 వికెట్లను తమ ఖాతాలో వేసుకోని ఆసీస్ పతనాన్ని శాసించారు. మరోవైపు ఆస్ట్రేలియాకు నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, మ్యాట్ కుహ్నెమన్ వంటి స్పిన్నర్లు ఉన్నా వారు భారత బ్యాట్స్ మెన్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో భారత స్పిన్నర్లను కొనియాడుతూ ఇయాన్ ఛాపెల్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

అశ్విన్ సూపర్ స్పిన్నర్..

సాధారణంగానే ప్రత్యర్థి బౌలర్లు.. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా బౌలింగ్‌ నైపుణ్యాలను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారని ఆయన తెలిపారు. అయితే, భారత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది జడేజా-అశ్విన్ ద్వయానికి పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. ముఖ్యంగా అశ్విన్‌కు పిచ్‌ ఎలా ఉన్నాసరే.. అద్భుతంగా బౌలింగ్‌ చేయగల సత్తా వారికి ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలోనే అతను ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడని గుర్తు చేశాడు. ఉత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడని, ఫలితాన్ని ఎలా రాబట్టాలి.. ఏం చేయాలనేదానిపై స్పష్టత ఉన్న ఏకైక స్పిన్ బౌలర్‌ అశ్విన్ అని పేర్కొన్నారు. రవీంద్ర జడేజా మరీ అంత నైపుణ్యం కలిగిన బౌలర్‌ కాకపోయినా.. భారత పిచ్‌లకు తగ్గ స్పిన్నరని కొనియాడాడు. ఎప్పటికప్పుడు తన స్కిల్స్‌ను మెరుగుపర్చుకునే వ్యక్తి వీరిద్దరూ కలిసి కలిసి భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని తెలిపాడు.

లయన్ అశ్విన్‌ను అనుకరించవద్దు..

ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్ నాథన్ లయన్‌ తన శైలినే ఫాలో కావాలని సూచించాడు. భారత్‌ పిచ్‌ల్లో అశ్విన్‌ మాదిరిగా బౌలింగ్‌ చేయాలని ప్రయత్నించడం ఏమాత్రం సరైంది కాదన్నాడు. లయన్ బౌలింగ్ నైపుణ్యాలకు అశ్విన్ అనుకరించడం సరితూగలేదన్నాడు. ఢిల్లీ టెస్ట్‌లో అశ్విన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. జడేజాకు ఏడు వికెట్లు దక్కాయని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుండటం సహజమేనని చెప్పుకొచ్చాడు. అందుకే అశ్విన్‌లా బంతులను వేయడానికి ప్రయత్నించకుండా.. నాథన్ లయన్ తన శైలిలోనే బౌలింగ్‌ చేయాలని ఇయాన్‌ ఛాపెల్‌ సూచించాడు.



Next Story

Most Viewed