ఈసారి అదిరిపోనున్న ఖైరతాబాద్ గణేషుడు.. ప్రత్యేకతలు ఇవే!

by  |
Khairatabad Ganesh
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు గుర్తొస్తాడు. ప్రతిఏడాది ఎంతో వైభవంగా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులు సైతం అక్కడికి వచ్చి, దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతటి మహత్తర చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేషుడు విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గతేడాది కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, పూర్తి కరోనా నిబంధనలు పాటించేలా నిర్వహించాలని ఉత్సవ కమిటీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల నిర్వాహకులు కర్రపూజ చేశారు. ప్రస్తుతం విగ్రహం తయారీని ప్రారంభించారు. ఈసారి విగ్రహం ఎత్తు, ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన ఈ వీడియోలో చూడండి.

Next Story

Most Viewed