ఆదాయం పెంపు కోసం స్పెషల్ డ్రైవ్ జరపాలి: హరీశ్ రావు

by  |
ఆదాయం పెంపు కోసం స్పెషల్ డ్రైవ్ జరపాలి: హరీశ్ రావు
X

దిశ, మెదక్: సుడా విస్తరిత ప్రాంతాల్లో ప్రణాళికా బద్ధమైన పట్టణీకరణ పనులు చేపట్టేలా చొరవ చూపాలని సుడా అధికారులు, డైరెక్టర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట అర్భన్ డెవలెప్ మెంట్ అథారిటీ కార్యాలయంలో ఆదాయ పెంపు, అభివృద్ధి అంశాలపై సోమవారం రాత్రి గంటన్నర పాటు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిద్ధిపేట అర్భన్ డెవలెప్ మెంట్ అథారిటీ-సుడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని తెలిపారు. సుడా ఆదాయం పెరిగేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సుడా డైరెక్టర్లు, అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రత్యేకించి సుడా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు, దాదాపు 10 ఏకరాల స్థలంలో నర్సరీ ఏర్పాటు, వాటి నిర్వహణ, లీజు పద్ధతుల అంశంపై చర్చించారు. నర్సరీ ఏర్పాటు, నిర్వహణ పై దృష్టి కేంద్రీకరించాలని అధికారులు, డైరెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నర్సరీల్లో అందమైన పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లతోపాటు అన్నీ రకాల మొక్కలన్నీ ఉండేలా నర్సరీలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బర్ల మల్లిఖార్జున్, ముత్యాల కనకయ్య, పల్లె వెంకట్ గౌడ్, తెల్జీరు శ్రీనివాస్, వజీర్, సుడా అధికారిక యంత్రాంగం రాజీవ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed