గొప్ప పనులు చేస్తున్రు: స్పీకర్ పోచారం

by  |
గొప్ప పనులు చేస్తున్రు: స్పీకర్ పోచారం
X

ధిశ, సిరిసిల్ల: దేశంలోనే అద్భుతల పథకాలను ఆవిష్కరించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు, తుర్కపల్లిలో హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… తెలంగాణాలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు మొక్కలు నాటాలని పిలపునిచ్చారు. మానవ మనుగడకు చెట్లు అత్యంత ముఖ్యమైనవని గుర్తు పెట్టుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నారని కొనియాడారు. కళ్యాణ లక్ష్మీ లాంటి ఎన్నో గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని, రైతుబంధు ప్రపంచంలోనే అద్భుతమైన పథకంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో 20 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లాలో కోటి 40లక్షలు మెక్కలు నాటామని, హరిదాస్ నగర్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ని ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. అన్ని జిల్లాలకు ధీటుగా సిరిసిల్లలో హరితహారం కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు. అవునూర్ లో సీడ్ కేంద్రం మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మానేరు నదిపై 11 చెక్ డ్యాంలు నిర్మించనున్నామని, వచ్చే ఏడాది నాటికి మానేరు జలకళ సంతరించుకోవడం ఖాయమన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో కరోనా సమయంలో సైతం రైతు బంధు అందించామని, సంక్షోభంలో సైతం సంక్షేమం ఆగడం లేదన్నారు. కరోనా వ్యాధి ప్రబలుతున్నా కూడా రికార్డ్ సాయిలో ధాన్యం కొనుగోలు చేశామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి ఢోకా లేకుండా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుందని, సిరిసిల్లను దేశంలో అగ్ర స్థానంలో నిలబెట్టే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. మహిళలు హరితహారం లో మొక్కలు నాటలని, భవిష్యత్ తరాలకు పచ్చదనం ఉపయోగపడతుందన్నారు.



Next Story

Most Viewed