IND vs RSA: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ ఎంతంటే..?

by  |
IND vs RSA: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో‌ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. తొలి రోజు 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన టీమిండియా రెండో రోజు వర్షం కారణంగా క్రీజులోకి రాలేదు. ఇక మూడో రోజు క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(123) 278 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 291 పరుగుల వద్ద రహనే(48) కూడా ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(8), అశ్విన్ (4), ఠాకూర్ (4), షమీ(8), బుమ్రా(14)లకే వికెట్లు పారేసుకున్నారు. ఇక చివరి బ్యాటర్ సిరాజ్(4 నాటౌట్‌)‌గా నిలిచే సరికి 327 పరుగులు చేయగలిగింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ ఒక పరుగు మాత్రమే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సెంచూరియన్‌లో పోరు కొనసాగుతోంది.



Next Story

Most Viewed