ఇప్పుడు సుశాంత్.. రేపు సింగర్? : సోనూ నిగమ్

by  |
ఇప్పుడు సుశాంత్.. రేపు సింగర్? : సోనూ నిగమ్
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. అతని కుటుంబంతో పాటు మిత్రులు, అభిమానులను ఇంకా కోలుకోనివ్వడం లేదు. ‘సినీ పరిశ్రమ నుంచి ఆదివారం మరణవార్త విన్న మీరు.. సంగీత ప్రపంచం నుంచి కూడా త్వరలో వినే చాన్స్ ఉందంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్. కారణం సంగీత ప్రపంచాన్ని మాఫియా పట్టి పీడిస్తోందని.. రెండు కంపెనీలు గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ గాయకులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఒక సింగర్‌ను పాడించాలన్నా లేదా తప్పించాలన్నా మొత్తం వారి చేతుల్లోనే ఉందన్నారు.

View this post on Instagram

You might soon hear about Suicides in the Music Industry.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on

కాగా ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. జీ మ్యూజిక్ కంపెనీ, టీ సిరీస్, వైఆర్‌ఎఫ్ మ్యూజిక్ సంస్థలు వీటిలో ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరూ వ్యాపారంలో పాలించాలని కోరుకునేవారే తప్ప.. కొత్తగా వస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించే వారే లేరని చెప్పాడు. ‘నేను ఎప్పుడో వచ్చాను కాబట్టి సరిపోయింది కానీ.. కొత్తగా వచ్చే పిల్లలు మ్యూజిక్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed