గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సోము వీర్రాజు లేఖ

by  |
గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సోము వీర్రాజు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్ కమిటీ సమావేశంలో చర్చించాలని కోరుతూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సోమవారం లేఖ రాశారు. ఉద్యమ సమయంలో నీటి వనరులపై కేసీఆర్ అవగాహన పెంచుకున్నారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ సానుకూలంగా స్పందించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారే నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేశారని, తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీకి చెందిన సీఎం, మంత్రులు సహకరించారని పేర్కొన్నారు. విభజన తర్వాత తెలంగాణలో అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించారని, ఆ ప్రాజెక్టులపై చంద్రబాబు, జగన్ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు.

కేంద్రంపై చేసిన విమర్శలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని సూచించారు. విభజన తర్వాత కేంద్రంపై ఏపీ ప్రభుత్వం వ్యాఖ్యలను ఖండిచామని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో రాయలసీమది ప్రముఖ పాత్ర అని, సాగు నీరు లేకుంటే అద్భుత ధాన్యాగారం కోల్పోతామన్నారు. ఎవరికీ నష్టం లేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి చర్చించాలని లేఖలో కోరారు.



Next Story

Most Viewed