జవహర్‌నగర్‌లో శీతాకాలం అందాలు.. పొగ మంచులో అరుదైన దృశ్యాలు

by  |
జవహర్‌నగర్‌లో శీతాకాలం అందాలు.. పొగ మంచులో అరుదైన దృశ్యాలు
X

దిశ, జవహర్ నగర్ : నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది.. సాయంత్రం ఆరు నుంచే చలి గాలులు వీస్తున్నాయి.. ఉదయం ఎనిమిది దాటినా కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. శీతాకాలంలో కాశ్మీర్‌ను తలపించే అందాలు జవహర్ నగర్‌లో కనిపిస్తున్న అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వణికిస్తున్న చలికి ఇప్పుడు మంచు పొగ తోడైంది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులను కనువిందు చేస్తున్నది.

తెలంగాణలో కొద్దిరోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో దట్టంగా పొగ మంచు కమ్మేస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జవహర్ నగర్‌లో ఆదివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ మంచు దట్టంగా అలుముకునే ఉంది. మార్నింగ్ 8 గంటలు దాటినా వాహనదారులు లైట్లు వేసుకొని బండ్లు నడపాల్సి వచ్చింది. అలాగే, బాలాజీ నగర్ ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాకింగ్‌కు వచ్చిన ప్రజలు చలికి వణికిపోయారు. పొగ మంచుపై ‘దిశ’ దృష్టిపెట్టి దృశ్యాలను కెమెరాతో బంధించింది.


Next Story