జూరాలలో స్లో అయిన ఇన్‌ఫ్లో

by  |
జూరాలలో స్లో అయిన ఇన్‌ఫ్లో
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : గత వారం రోజులుగా ఎగువ నుండి వస్తున్న వరద నీటి ప్రవాహంతో పరవళ్ళు తొక్కిన కృష్ణమ్మ కొంత శాంతించింది. ఆదివారం నుండి నెమ్మదిగా తగ్గుతున్న వరద సోమవారం ఉదయానికి మరింతగా తగ్గుముఖం పట్టింది. సోమవారానికి వరదనీటి ప్రవాహం 1,78,000 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో అధికారులు తగ్గుతున్న వరదకు అనుగుణంగా గేట్లను కూడా మూసివేస్తున్నారు. ప్రస్తుతం 20 గేట్ల ద్వారా 1,63,627 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రస్తుత నీటిమట్టం 317.880 ఉండగా 8.377 టీఎంసీల నీటిని అధికారులు నిల్వ చేస్తున్నారు.

Next Story

Most Viewed