6 నుంచి 8 తరగతుల నిర్వహణపై విద్యాశాఖ కీలక నిర్ణయం..

by  |
6 నుంచి 8 తరగతుల నిర్వహణపై విద్యాశాఖ కీలక నిర్ణయం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ కాలేజీలు ప్రారంభమవ్వగా, పాఠశాలల విషయానికొస్తే 9,10వ తరగతి విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్తున్నారు. తాజాగా 6 నుంచి 8వ తరగతులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 6 నుంచి 8వ తరగతి క్లాసులను రేపటి నుంచి (బుధవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

మార్చి 1లోపు పూర్తిస్థాయిలో పాఠశాలల్లోనే బోధన జరుగుతుందని వివరించారు. అయితే, పిల్లలను పంపడం, పంపించకపోవడాన్ని తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేసింది. కాగా, కొవిడ్ నేపథ్యంలో అందరూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. మాస్కులు, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని విద్యాశాఖ స్పష్టంచేసింది.


Next Story

Most Viewed