అట్టహాసంగా సింగరేణి డే వేడుకలు ప్రారంభం

by  |
Singareni-vedukalu-1
X

దిశ, తాండూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల గోలేటిలోని శ్రీ భీమన్న స్టేడియంలో గురువారం సింగరేణి 132 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాధా కుమారితో కలిసి సింగరేణి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి పతాక ఆవిష్కరణ చేసి జీ.ఎం. అధికారులు, అతిథులు సెల్యూట్ చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జీఎం, ఏరియా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, అతిథులు ప్రారంభించారు. స్టాళ్ల ప్రదర్శనను జీఎం పరిశీలించి వాటి యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. జై సింగరేణి, జై తెలంగాణ నినాదాలతో స్టేడియం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు కృష్ణారావు, చంద్రశేఖర రావు, తిరుమల రావు, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ్ రావు, శివరామిరెడ్డి, కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస రావు, మంగీలాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed