‘గణనీయంగా తగ్గిన నేరాలు, రోడ్డు ప్రమాదాలు’

by  |
‘గణనీయంగా తగ్గిన నేరాలు, రోడ్డు ప్రమాదాలు’
X

దిశ, మెదక్: గత రెండు నెలల నుంచి కరోనా వ్యాధి నియంత్రణకు అహర్నిశలు విధులు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు. గత రెండు నెలలుగా కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కరోనా వ్యాధి నియంత్రణకు శ్రమించడంతో పాటు, పూర్తి సమయాన్ని కరోనా కట్టడికే పనిచేయడం జరిగిందని, ఇదే సమయంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖపట్టడంతోపాటు, రోడ్డు ప్రమాదాలు సైతం సింగల్ డిజిట్‌గా నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు కొన్ని మినహాయింపులు ఇస్తుండటంతో మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది లాక్‌డౌన్ విధులను నిర్వర్తిస్తూనే సాధారణ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ అధికారులు పిలుపునిచ్చారు. ప్రధానంగా రాజీవ్ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వుంటుందని, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విచారించి జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుందని కమిషనర్ సూచించారు.



Next Story

Most Viewed