దుబ్బాకలో టీఆర్ఎస్‌కు షాక్ ?

by  |
దుబ్బాకలో టీఆర్ఎస్‌కు షాక్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్‌ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి టికెట్ కాన్ఫామ్‌పై ఎలాంటి హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మూడు నెలల క్రితం చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

అయితే రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టికెట్ కేటాయించేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుండటంతో శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో నిలిచేందుకు టికెట్ అడగ్గా టీఆర్ఎస్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో శ్రీనివాస్‌రెడ్డికి గాలం వేసిన కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతోంది. సోమవారం మధ్యాహ్నం దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై మెదక్ జిల్లా నేతలతో సమావేశమైన ఉత్తమ్ కుమార్.. ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం విశేషం.



Next Story

Most Viewed