మిత్రపక్షానికి షాక్.. శివసేన డేరింగ్ డెసిషన్

by  |
మిత్రపక్షానికి షాక్.. శివసేన డేరింగ్ డెసిషన్
X

ముంబయి: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేయడంలేదు. మమత బెనర్జీకి తన మద్దతును శివసేన ప్రకటించింది. బెంగాల్‌లో శివసేన పోటీ చేస్తున్నదా? అనే ప్రశ్నలకు తెరదించుతూ శివసేన ఎంపీ, సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. బెంగాల్‌లో అందరిపై దీదీ ఒక్కరే దీటుగా పోరాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీదీకి వ్యతిరేకంగా మీడియా, మందబలం, డబ్బులు శక్తివంతమవుతున్నాయని వివరించారు. అందుకే ఈ ఎన్నికల్లో శివసేన పోటీ చేయాలని భావించడం లేదని పేర్కొన్నారు.

కానీ, మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. మమతా దీదీ ఘన విజయం సాధించాలని కోరుతున్నామని ప్రకటించారు. ఎందుకంటే నిజమైన బెంగాల్ టైగర్ దీదీనే అని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో మిత్రపక్షమైన కాంగ్రెస్ బెంగాల్‌లో టీఎంసీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నది. ఈ నేపథ్యంలో శివసేన తన వైఖరి స్పష్టం చేయడం గమనార్హం. బిహార్‌లోని కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ నేత కూడా దీదీకి మద్దతునిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

Next Story