స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే మహిళలు వేశ్యలా..?

by  |
స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే మహిళలు వేశ్యలా..?
X

దిశ, సినిమా : కన్నడ యాక్ట్రెస్, డైరెక్టర్ శీతల్ శెట్టి సమాజానికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య అసభ్యకర ట్రోలింగ్ పేజీలపై స్పందించిన శీతల్.. లేటెస్ట్‌గా బాడీ షేమింగ్‌కు గురవుతున్న మహిళల సంఖ్య పెరగడంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది.

ఈ విషయంతో తనకు సంబంధం లేకపోయినా, పర్సనల్ కనెక్షన్ లేకపోయినా సరే.. ఈ మ్యాటర్ గురించి మాట్లాడాలని అనుకున్నానని సోషల్ మీడియాలో లాంగ్ నోట్ షేర్ చేసింది. కానీ ఇది తన జెండర్(ఉమన్)కు సంబంధించిన ఇష్యూ అని, సొసైటీలో ఇలాంటి చీప్ బిహేవియర్ చూసి ఒక మహిళగా భరించలేకపోతున్నానని చెప్పింది. అందుకే ఈ విషయానికి వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నట్లు తెలిపింది.

స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న, కెరియర్‌ను సక్సెస్‌ఫుల్‌గా బిల్డ్ చేసుకుంటున్న మహిళలపై వేశ్య అనే ముద్రవేయడం, వారి ఫిజిక్‌పై సోషల్ మీడియాలో భయంకరమైన నెగెటివ్ కామెంట్స్ చేయడం చూసి తట్టుకోలేకపోతున్నానని వెల్లడించింది శీతల్. ఈ కామెంట్స్ చేసేవారితో పాటు చదివే కొందరికి సరదాగా అనిపిస్తుందేమో కానీ.. అలాంటి ఆలోచనలు రోజురోజుకూ తనను భయపెడుతున్నాయని పేర్కొంది. అందరం కలిసి ఈ ప్రపంచాన్ని మహిళలకు బెట్టర్ ప్లేస్‌గా మార్చాలని కోరింది.

Next Story

Most Viewed