షర్మిల దూకుడు: సోషల్ మీడియాలోకి ఎంట్రీ

117

దిశ వెబ్‌డెస్క్: ‘తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. ఎందుకు లేదు?.. రాజన్న రాజ్యం తీసుకొస్తా’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. షర్మిల అనూహ్య పొలిటికల్ ఎంట్రీ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. కేసీఆర్, జగన్ వదిలిన బాణం షర్మిల అని కొంతమంది ఆరోపించగా.. జగన్‌తో విబేధాలతోనే షర్మిల కొత్త పార్టీ పెట్టారని మరికొంతమంది ఆరోపించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. షర్మిల మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుపై చకచకా అడుగులు వేస్తు్న్నారు.

త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న షర్మిల ఇప్పుుడు మరింత స్పీడును పెంచారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటు, విధివిధానాలకు సంబంధించిన వ్యవహారాలు చకచకా జరుగుతున్నాయి. త్వరలో ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ అనే పేరును పెట్టినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే.. షర్మిల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ షర్మిల పేరుతో అధికారిక ట్విట్టర్ పేజీ ప్రారంభమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ షర్మిల తొలి ట్వీట్ చేశారు. ‘అన్నింటా మనం.. అన్నింటా సగం.. మహిళా దినోత్సవ సాక్షిగా ఇదే మన సంకల్పం’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..