‘మహా’ సర్కారు‌కు శరద్ పవార్ రిమోట్

by  |
NCP Sharad-Pawar
X

ముంబయి: కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర విభాగం చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కొద్ది కాలంగా ఆయన అధికార కూటమి మహావికాస్ అగాధీ(ఎంవీఏ)పై అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారు, మళ్లీ సరిదిద్దుకుంటున్నారు. తాజాగా, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై కామెంట్ చేశారు. మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వానికి శరద్ పవారే రిమోట్ కంట్రోల్ అని వ్యాఖ్యానించారు.

‘శరద్ పవార్ ఎన్సీపీ చీఫ్. నేను కాంగ్రెస్ చీఫ్. మేం మా పార్టీలను బలోపేతం చేయాలని సహజంగానే భావిస్తాం. కానీ, ఎంవీఏ ప్రభుత్వ ఏర్పాటులో శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు. మాకు ఆయనే సలహాలు, సూచనలు చేస్తుంటారు. అందుకే ఆయన రిమోట్ కంట్రోల్’ అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుందని ఆయన ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇది మొదలు వరుసగా కూటమికి ప్రతికూలంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు

. వాటిని కూటమి సభ్యులు కొట్టిపారేస్తున్నారు. తన వ్యాఖ్యలు సరిదిద్దుకోవడంలో భాగంగా తన కామెంట్లను తప్పుగా చిత్రించారని, కూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని వివరణ ఇస్తున్నారు. నానా పటోలేపై స్పందించడానికి శరద్ పవార్ విముఖత చూపించారు. చిన్న నేతలపై తాను స్పందించబోరని, సోనియా గాంధీ మాట్లాడితే తన స్పందన ఉంటుందని పవార్ అన్నారు.

Next Story

Most Viewed