క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం: ఆర్‌బీఐ గవర్నర్

by  |
క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం: ఆర్‌బీఐ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వంపై చూపే ప్రభావంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఇటీవల క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమలో ఆర్‌బీఐ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వం ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని, దీని గురించి ప్రభుత్వానికి వివరించినట్టు, త్వరలో తగిన నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.

భారత్‌లో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. దేశీయంగా క్రిప్టోకరెన్సీని నిషేధిస్తూ, స్వంతగా డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అందుకోసం సిద్ధంగా ఉన్నట్టు దాస్ స్పష్టం చేశారు. అందుబాటులో ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదని, దీనికి అవసరమైన టెక్నాలజీ, విధానపరమైన అంశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని శక్తికాంతదాస్ వివరించారు.

Next Story

Most Viewed