టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న సెరేనా

by  |
Serena
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు టెన్నిస్ స్టార్ సెరేనా విలియమ్స్ ప్రకటించింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం వింబుల్డన్ బరిలో దిగుతున్న సెరేనా.. తన నిర్ణయాన్ని ప్రకటించింది. నేను అమెరికా ఒలింపిక్ జాబితాలో లేను.. దాని గురించి నేను ఆలోచించడం లేదు.. కేవలం వింబుల్డన్‌పైనే నా దృష్టి అని సెరేనా మీడియా సమావేశంలో తెలిపింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ మినహా 2000 నుంచి 2016 వరకు నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో అమెరికా తరపున పాల్గొన్నది. సెరేనా ఖాతాలో నాలుగు ఒలింపిక్ పతకాలు కూడా ఉన్నాయి.

కాగా, కరోనా కారణంగా విదేశీ ప్రేక్షకులకు, ఇతరులకు టోక్యో ఒలింపిక్స్‌కు హాజరవడానికి అవకాశం లేదు. దీంతో తన మూడేళ్ల కూతురు ఒలింపియాను టోక్యో తీసుకెళ్లడానికి అవకాశం లేకపోవడంతోనే విశ్వ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. గతంలో కూడా నిర్వాహకులకు తన కూతురు రావడానికి అవకాశం ఇవ్వాలని సెరేనా కోరింది. కానీ టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. మరోవైపు స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ కూడా ఒలింపిక్స్‌లో ఆడేది అనుమానంగానే మారింది. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్దాంతరంగా వైదొలగిన ఫెదరర్ ప్రస్తుతం వింబుల్డన్ ఆడుతున్నాడు. అయితే ఒలింపిక్స్‌ అతడు స్విట్జర్లాండ్ తరపున ఆడటం కష్టమేనని కోచ్ తెలిపాడు.



Next Story

Most Viewed