వెయ్యికి పైగా లాభపడిన మార్కెట్లు!

by  |
వెయ్యికి పైగా లాభపడిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలను చూసిన మార్కెట్లు మంగళవారం అధిక లాభాలను చూశాయి. కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొని, పంపిణీ వ్యవస్థ గాడిలోకి పడుతోందనే వార్తలతో మార్కెట్లకు సానుకూల సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే అక్కడ సుమారు 30 శాతం కర్మాగారాలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన మెటల్ రంగంలోని సూచీలు లాభాలను నమోదు చేస్తున్నాయి. ఈ రంగం షేర్లు సుమారు 4 శాతం లాభాలను చూస్తున్నాయి.

ఈ పరిణామాలతో దేశీయ మార్కెట్లు సైతం లాభాలతోనే మొదలై, ముగింపు కూడా లాభాల్లోనే నమోదయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1028.17 పాయింట్ల లాభంతో 29,468 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 316.65 పాయింట్లు లాభపడి 8,597 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సుమారు అన్ని సూచీలు లాభాల్లోనే కదలాడగా, ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా నష్టాలను నమోదు చేసింది. రంగాల వారీగా పరిశీలిస్తే, ఎనర్జీ రంగం అధికంగా 7 శాతం పెరిగింది. మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు సైతం లాభాలను నమోదు చేశాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Next Story

Most Viewed