తిరిగి లాభాల బాటలో మార్కెట్లు!

by  |
తిరిగి లాభాల బాటలో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను దక్కించుకున్నాయి. గురువారం డీలాపడిన సూచీలు వారాంతం మళ్లీ ఊపందుకున్నాయి. ఒకరోజు విరామం తర్వాత తిరిగి కోలుకున్నాయి. ఉదయం జోరుగా మొదలైన మార్కెట్లు మిడ్ సెషన్ వరకు అధిక లాభాలతో కొనసాగిన తర్వాత అమ్మకాలు పెరిగాయి. తర్వాత చివరి గంటలో కోలుకుని మెరుగైన లాభాలతో ముగించాయి. జీడీపీ రికవరీ, వ్యాక్సిన్‌పై అంచనాలే ఈ వారాంతం కూడా మార్కెట్లను నడిపించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 139.13 పాయింట్లు లాభపడి 46,099 వద్ద ముగియగా, నిఫ్టీ 35.55 పాయింట్ల లాభంతో 13,513 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్, రియల్టీ రంగాలు బలపడగా, ఐటీ, ఫార్మా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.71 వద్ద ఉంది.

Next Story

Most Viewed