మళ్లీ లాభాల బాటలో మార్కెట్లు

by  |
మళ్లీ లాభాల బాటలో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను దక్కించుకున్నాయి. గురువారం నాటి నష్టాల నుంచి కోలుకున్న సూచీలు ప్రధాన షేర్ల మద్దతుతో కోలుకున్నాయి. ఉదయం ప్రారంభ సమయంలో డీలాపడినప్పటికీ, మిడ్ సెషన్ తర్వాత పుంజుకున్నాయి. రోజంతా ఆటుపోట్లకు గురైన మార్కెట్లు అమెరికా మార్కెట్లలో ప్యాకేజీ అంశంపై సానుకూల సంకేతాలతో జోరు పెంచాయి. అయినప్పటికీ, ఇటీవల పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ట్రేడర్లు జాగ్రత్తగా ఉన్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 282.89 పాయింట్లు లాభపడి 43,882 వద్ద ముగియగా, నిఫ్టీ 87.35 పాయింట్ల లాభంతో 12,859 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్పంగా బలపడగా, మీడియా రంగం షేర్లు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.16 వద్ద ఉంది.


Next Story

Most Viewed